విజయ-వాహిని సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డి కన్నుమూత

  • కొంతకాలంగా వెంకట్రామిరెడ్డికి అనారోగ్యం 
  • తెలుగు, తమిళ సినీ ప్రముఖుల సంతాపం
  • రేపు చెన్నైలో అంత్యక్రియలు
విజయ-వాహిని సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి (75) చెన్నైలో ఈరోజు మృతి చెందారు. వెంకట్రామిరెడ్డి మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, తమిళంలో ఆయన ఐదు చిత్రాలు నిర్మించారు. విజయ్ బ్యానర్ పై ప్రముఖ హీరోలు అజిత్, విజయ్, ధనుష్, విశాల్ తో ఆయన సినిమాలు తీశారు. శ్రీకృష్ణార్జున విజయం, భైరవద్వీపం, బృందావనం తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించే నిమిత్తం తన తండ్రి పేరిట ప్రతి ఏటా పురస్కారాన్ని వెంకట్రామిరెడ్డి అందిస్తున్నారు.
Go Back to Shorts
vijaya-vahini
b.nagireddy
chennai
funerals

More Telugu News